Katepally: కాటేపల్లిలో ఘనంగా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలు!
Katepally: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్‌గల్ మండలం కాటేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం జరిగాయి.
Katepally: కాటేపల్లిలో ఘనంగా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలు!
కాటేపల్ల: కాటేపల్ల పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చిన్నారులే దేశ భవిష్యత్తుకు పునాదులని వారి విద్య, వికాసం, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.నెహ్రు పిల్లలపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిన నెహ్రూ సేవలను, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, మొగలాగౌడ్, గంగా గౌడ్, చాంద్ పాషా, షఫీ పటేల్, రవి తదితరులు పాల్గొన్నారు.




