Jukkal: జుక్కల్‌లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం!

Jukkal: రత్నగిరి నానీజ్ ధామ్‌కు 600 కి.మీ. సాగిన వసుంధర పాదయాత్ర పూర్తి చేసుకుని జుక్కల్ చేరుకున్న నరేంద్రచార్య స్వామి భక్తులకు ఘన స్వాగతం లభించింది.

VEERANNA, JUKKAL
Published on: 24 Oct 2026 4:03 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్‌లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం!

జుక్కల్: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతూ గత నేల 27 న జుక్కల్ మండలం దోస్త్ పల్లి - బంగారు పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న జగద్గురు స్వామి నరేంద్ర చార్య జి మహారాజ్ యొక్క తెలంగాణ ఉప పీఠం నుండి వేలాది మంది భక్తులతో ప్రారంభమైన వసుంధర 28 రోజులపాటు పాల్గొని పాదయాత్ర శనివారం జుక్కల్ కు చేరుకోవడంతో ఉప పీఠం నిర్వాహకులు యత్రికులకు ఘనంగా స్వాగతం పలికారు.

జగద్గురు స్వామి నరేంద్ర చార్య జి మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ మండలం లొని శ్రీ క్షేత్ర తెలంగాణ ఉపపీఠం నుండి సుమారు 600 వందలకు పై చిలుకు కిలోమీటర్లు దూరంలో ఉన్న మహారాష్ట్ర లొని రత్నగిరి జిల్లా నానీజ్ ధామ్ వరకు స్వామి పల్లకి ని మోస్తూ నరేంద్ర స్వామి భక్తులు పాదయాత్ర గా వెళ్లి 28 రోజుల తర్వాత క్షేమంగా జుక్కల్ ఉపపిఠానికి చేరుకోవడంతో వారికి హరతులతో స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఉపపీఠం సభ్యులు మద్నూర్ మార్కెట్ కమిటి మాజి చైర్మన్ కె. సాయాగౌడ్ కు శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమం లో కమిశెట్టి వార్ శ్రీనివాస్, కృష్ణ గౌడ్, నరేష్ సెట్, బాబ్రే శివాజి, సెల్కె శివాజీ తోపాటు నరేంద్ర స్వామి భక్తులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL