Kamareddy: సర్వీస్ రోడ్డు ఆక్రమణలపై మొహమ్మద్‌నగర్ పోలీసుల హెచ్చరిక!
Kamareddy: కామారెడ్డి జిల్లా మొహమ్మద్‌నగర్ సర్వీస్ రోడ్డుపై ఆక్రమణలకు పోలీసుల చెక్. పశువులు కట్టేసినా, అడ్డంకులు సృష్టించినా చర్యలు తప్పవని ఎస్సై జె.శివకుమార్ హెచ్చరిక.
Kamareddy: సర్వీస్ రోడ్డు ఆక్రమణలపై మొహమ్మద్‌నగర్ పోలీసుల హెచ్చరిక!
కామారెడ్డి: మొహమ్మద్‌నగర్ మండలంలోని నడిమి తాండ, గిర్నీ తాండ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డుపై వస్తువులు ఉంచడం, పశువులను కట్టేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొహమ్మద్‌నగర్ ఎస్సై జె. శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సర్వీస్ రోడ్డుపై ఎలాంటి వస్తువులు ఉంచకూడదని, పశువులను కట్టేయకూడదని సూచించారు.
రహదారిని అడ్డగించడం చట్టవిరుద్ధమని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజల భద్రత, వాహనదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లను ఆక్రమణల నుంచి విముక్తంగా ఉంచాలని పోలీసులు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.




