Pitlam: ఆహారం వికటించి ఆస్పత్రిపాలు: బాధితులను పరామర్శించిన ఆర్డీవో!

Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం తండాలో నిల్వ ఉంచిన మటన్ తిని నలుగురు చిన్నారులతో సహా 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆర్డీవో బాధితులను పరామర్శించారు.

SALEEM, BANSWADA
Published on: 19 Oct 2026 7:06 PM IST
Pitlam
X

Pitlam: ఆహారం వికటించి ఆస్పత్రిపాలు: బాధితులను పరామర్శించిన ఆర్డీవో!

పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం తండాలో మటన్ తిని 4 గురు పిల్లల తో పాటు 30 మంది అస్వస్థతకు గురయ్యారు.తండా వాసులు దసర పండుగకు ముందే మేకతో విందు చేసుకున్నారు. ఈ విందులో బంధువులు కూడా పాల్గొన్నారు.నిన్న కోసిన మేక మటన్ నిన్న ఇవ్వాళ తిన్నారు.ఇవ్వాళ మాటన్ తిన్న గంటకే వాంతులు విరో చనాలు అయ్యాయి.

వెంటనే పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఇంకా మెరుగైన చికిత్స కోసం 4 గురు చిన్నారులతో పాటు, 12 మందినీ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డిఒ రవీందర్ రెడ్డిఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్తితిని అడిగి తెలుసుకునీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను సూచించారు.ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్తితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.ప్రాణాపాయం ఏమీ లేదని ,కోలుకోవడానికి కొద్ది సమయం పడుతుందని వారు సూచించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA