Kamareddy: పిట్లంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ
Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్.
Kamareddy: పిట్లంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ
Kamareddy: పిట్లం (కామారెడ్డి) చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పాటుపడాలని కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ రూరల్ సిఐ తిరుపతయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం పిట్లం మండల కేంద్రంలో ఆయన స్థానికులతో కలిసి 2K రన్ నిర్వహించారు.
రోజు వ్యాయామాలు చేస్తూ ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా చెడు అలవాటుకు యువత తమ బంగారు భవిష్యత్తు ను బలి చేసుకోకుండా కాపాడుకోవాలని యువతకు సూచించారు.
ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తమ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద డ్రగ్స్ కార్యకలపలపై గమనిస్తూ వెంటనే తమ పోలీస్ శాఖ కు సమాచారం అందించాలని తద్వార దాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు 2K రన్ లో భారీ సంఖ్యలో యువకులు, ఎస్సే ఆంజనేయులు, న్యాయవాది రాంరెడ్డి, పిట్లం సర్పంచ్ చంద్ర శేఖర్ నవీన్, పోలీస్ సిబ్బంది, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.




