Kamareddy: ఇసానపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి దేవాదాయ కమిషనర్ రాక!
Kamareddy: రామారెడ్డి మండలం ఇసానపల్లి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందించారు.
Kamareddy: ఇసానపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి దేవాదాయ కమిషనర్ రాక!
కామారెడ్డి: ఇసానపల్లి రామారెడ్డి గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు గారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ కాలభైరవ స్వామి ఉత్సవాలు ఈ కార్తీక మాసంలో 28వ తారీఖు నుంచి ఘనంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అత్యధిక భక్తులు వస్తారు.
ఇది 'దక్షిణ కాశీ'గా పేరుపొందిన కాలభైరవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం మా రాష్ట్రంలో, మా మండలంలో, మా గ్రామంలో ఉండడం మా అదృష్టం. కమిషనర్ గారికి బిఆర్ఎస్ (BRS) పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో... ఈ దేవాలయానికి ఇంకా మౌలిక వసతులు, కనెక్టివిటీ లేవు కాబట్టి భక్తులకు సౌకర్యాల ఇబ్బంది ఉందని ఉద్దేశంతో మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.




