Kamareddy: కరెంట్ కోసం రైతుల ఆగ్రహం.. కామారెడ్డి రోడ్డు దిగ్బంధం!

Kamareddy: కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. త్రీఫేజ్ కరెంట్ సరిగ్గా రాక పంటలు ఎండిపోతున్నాయని ట్రాన్స్‌కోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

MADHU, KAMAREDDY
Published on: 10 Sept 2026 2:55 PM IST
Kamareddy
X

Kamareddy: కరెంట్ కోసం రైతుల ఆగ్రహం.. కామారెడ్డి రోడ్డు దిగ్బంధం!

కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి మండలం పల్వంచ మర్రి చౌరస్తా వద్ద త్రీ ఫేజ్ కరెంటు సప్లై సరిగా చేయడం లేదంటూ కామారెడ్డి -సిరిసిల్ల ప్రధాన రహదారిపై పల్వంచ, చుక్కాపూర్, వాడి, ఫరీద్ పెట్, మంతన్ దేవునీపల్లి గ్రామాల రైతులు ధర్నా.

త్రీ ఫేజ్ కరెంటు సరిగా సప్లై కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కేవలం 5,6 గంటలు మాత్రమే త్త్రీ ఫేజ్ కరెంటు సప్లై ట్రాన్స్కో అధికారులు చేస్తున్నారంటూ ట్రాన్స్కో అధికారులపై మండిపడ్డ రైతులు దీంతో ఇరువైపుల స్తంభించిన ట్రాఫిక్ ప్రతి గంటకు సుమారు పదిసార్లు కరెంటు ట్రిప్పు అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు గత పది రోజులుగా ఎండలు తీవ్రంగా కొట్టడంతో పొలాలలో నీరు లేక బీటలు బాస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసిన రైతులు ఎన్నిసార్లు ట్రాన్స్కో అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డ రైతులు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని నాణ్యమైన కరెంటును వ్యవసాయ బోరు బావులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన రైతులు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story