Banswada: కోనాపూర్‌లో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ రాజేష్ చంద్ర!
Banswada: బాన్సువాడ మండలం కోనాపూర్‌లో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు మూడో కన్నుగా పనిచేస్తాయని వెల్లడి.
Banswada: కోనాపూర్‌లో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ రాజేష్ చంద్ర!
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామం నేర రహిత గ్రామంగా మారే దిశగా అడుగులు వేసింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు.
"ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండటం వల్ల నేరాలు అదుపులో ఉంటాయి. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి సీసీ కెమెరాలు పోలీసులకు మూడో కన్నులా పనిచేస్తాయి" అని ఆయన అన్నారు. గ్రామస్తులందరూ పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు,డీ ఎస్ పీ విఠల్ రెడ్డి, సీఐ తుల శ్రీధర్ ,గ్రామ సర్పంచ్ ఎల్లాగోని కిష్టవ్వ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్దలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోనాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఒక మంచి ముందడుగు అని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




