Kamareddy: గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్ పీ.రాజేష్ చంద్ర
Kamareddy: బాన్సువాడలో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పర్యటించి కల్కి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Kamareddy: గణేష్ నిమజ్జన రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్ పీ.రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ లో కామారెడ్డి జిల్లా ఎస్ పీ రాజేష్ చంద్ర పర్యటించారు.సంగమేశ్వర కాలనీలో ప్రతిష్టించిన గణేశుని వద్ద ,పాత బాన్సువాడలోని సహకార సంఘం వద్ద గణేశునికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం బస్సులో ప్రయాణిస్తూ, కల్కి చెరువు వద్ద గణేష్ నిమజ్జనo ఏర్పాట్లను, రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు.
మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి డీ జె లకు అనుమతిలేదని అన్నారు. గణేష్ నిమజ్జనానికి అందరూ సహకరించి, మంచి వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు.
ఆయన వెంట డీ ఎస్ పీ విఠల్ రెడ్డి, ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి, సీ ఐ లు తుల శ్రీధర్, తిరుపయ్యలతో పాటు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ , స్థానిక నాయకులు కాసుల బాలరాజు, ఏర్వాల కృష్ణ రెడ్డి, మాసాని శ్రీనివాస్ రెడ్డి, నాగులగామ వెంకన్న, గోపాల్ రెడ్డి, జంగం గంగాధర్, గడుమల లింగం, మహమ్మద్ ఇజాస్, ఖాలీక్, అబ్దుల్ వహాబ్, ఉన్నారు.




