Madnoor: ఓటు వేయలేదని ఇల్లు కూల్చేస్తానంటూ సర్పంచ్ బెదిరింపు!

Madnoor: మద్నూర్ మండలం హండే కేలూరు పంచాయతీ వద్ద నిరుపేద మహిళ ధర్నా. ఓటు వేయలేదని ఇల్లు కూల్చేస్తానని సర్పంచ్ బెదిరిస్తున్నాడని ఆవేదన. ఎంపీడీవో హామీ.

VEERANNA, JUKKAL
Published on: 1 Aug 2026 8:05 PM IST
Madnoor
X

Madnoor: ఓటు వేయలేదని ఇల్లు కూల్చేస్తానంటూ సర్పంచ్ బెదిరింపు!

మద్నూర్: హండే కేలూరు (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కేలూరు గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదనే కక్ష్యతో సర్పంచ్ తన ఇంటిని కూల్చి వేస్తానంటూ బెదిరించడని ఓ బాధితురాలు ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి కి గ్రామస్తులు పెద్ద ఎత్తున మద్దత్తు తెలపడంతో గ్రామం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మద్నూర్ మండలం హండే కేలూరు గ్రామం లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ గడ్డివర్ లక్ష్మణ్ తనపై రాజకీయ కక్ష్య సాధింపుకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత ఇరవై ఐదు సంవత్సరాలు గా తనకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిసీఆశిస్తున్నానని, సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యలేదనే నెపంతో తన ఇంటిని కూల్చి వేస్తానంటూ సర్పంచ్ ప్రతి నిత్యం తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు జరుగుతున్న అన్యాయం పై న్యాయం చేయాలని కోరుతు గ్రామస్థుల మద్దత్తు తో బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైటయించి నిరసన వ్యక్తం చేసింది. ధర్నాలో బాధితురాలికి మాధత్తుగా నిలిచిన గ్రామస్తులు ఓ నిరుపేద మహిళపై కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని, బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

దశబ్దల కస్టర్జితమైన తన ఇంటిని కూల్చి వేస్తే తను నిరాశ్రాయురాలౌతనని, న్యాయం జరగకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు కన్నీటి పర్యాంతమైంది. దీంతో గ్రామంలో ఆందోళన కార పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న మద్నూర్ ఎంపి డి ఓ సత్యనారాయణ రెడ్డి,మద్నూర్ పోలీసులతో కలిసి గ్రామానికి చేరుకొని పరిస్థితి ని సమీక్షించారు.

బాధితురాలి పిర్యాదు పై క్షుణ్ణంగా విచారణ చేపట్టి తాగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లయితే ముందుగా నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటామని ఎంపి డి ఓ స్పష్టం చేశారు. అధికారుల హామీతో బాధితురాలు, గ్రామస్తులు ధర్నాను విరమించారు.హండే కేలూరు లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మద్నూర్ మండలం లో హాట్ హాట్ టాపిక్ గా మారింది.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story