Kamareddy: ట్రాఫిక్ పోలీస్ లుక్‌లో వినూత్న వినాయకుడు
Kamareddy: కామారెడ్డి రైల్వే స్టేషన్ ముందు ట్రాఫిక్ పోలీస్ లుక్‌లో వినూత్న వినాయక ప్రతిష్ఠాపన. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా సందేశాలతో ఫ్లెక్సీల ఏర్పాటు.
Kamareddy: ట్రాఫిక్ పోలీస్ లుక్‌లో వినూత్న వినాయకుడు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు ట్రాఫిక్ పోలీసుల మినూత్న ట్రాఫిక్ వినాయకుడు, ట్రాఫిక్ పోలీస్ లుక్ లో వినాయకుడు ప్రతిష్టాపించిన కామారెడ్డి టౌన్ పోలీసులు, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆలోచన మేరకు ట్రాఫిక్ పోలీస్ వినాయకుడు కామారెడ్డి పట్టణ పరిధిలో ఆకట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ వినాయకుని విగ్రహం.
వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధనించు భక్తా, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించు భక్తా, డ్రైవింగ్లో మొబైల్ వాడకు భక్తా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకు భక్తా, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించు భక్తా, నీకోసం నీ కుటుంబం ఎదురుచూస్తోంది క్షేమంగా ఇంటికి చేరుకో ప్రతి సంవత్సరం నా దర్శనానికి రా భక్తా.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కామారెడ్డి ప్రజలకు పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.




