Kamareddy: నర్సింగ్ రావు పల్లి మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం. మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ఉరివేసుకుని యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిజాంసాగర్ పోలీసులు.
Kamareddy: నర్సింగ్ రావు పల్లి మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి: నర్సింగ్ రావు పల్లి (కామారెడ్డి) నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్సై జె.శివ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన మంగలి అంజయ్య (32) అనే యువకుడు గత పదేళ్ల క్రితం కుటుంబ జీవనోపాధి కోసం భార్య మంగలి లక్ష్మి, కూతురు పూజలతో కలిసి కర్ణాటక లోని బీదర్ పట్టణానికి వెళ్లి ఓ హోటల్ లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు.
ఇటీవల ఓటరు నమోదు కోసం తన స్వగ్రామమైన నర్సింగ్ రావు పల్లి గ్రామానికి వచ్చిన అంజయ్య ఈ నేల 11 న ఇంటి రేకుల షెడ్డు వద్ద గల ఇనుప పైపుకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడని ఎస్సై తెలిపారు.మంగళవారం గ్రామానికి చెందిన మంగలి రమేష్ అనే వ్యక్తి గమనించి స్థానికుల సహాయం తో తాడు కోసి కిందకు దించి చూడగా అప్పటికే అంజయ్య మృతి చెందినట్లు గుర్తించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మృతుని భార్య లక్ష్మీ, తన భర్త మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడ్డాడని తన భర్త మృతిపై తనకు ఎలాంటి లేదని భార్య పోలీసులకు పిర్యాదుచేసింది . భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




