Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్‌లో ముదిరిన ఫైట్.. జిల్లా అధ్యక్షుడిపై వైస్ ప్రెసిడెంట్ ఫైర్!
Kamareddy: కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ రచ్చకెక్కింది.
Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్‌లో ముదిరిన ఫైట్.. జిల్లా అధ్యక్షుడిపై వైస్ ప్రెసిడెంట్ ఫైర్!
బిచ్కుంద (కామారెడ్డి): యువజన కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా తనను జిల్లా ఉపాధ్యక్ష పదవి నుండి ఎలా తొలగిస్తారంటూ కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యోగేష్ మంచివార్ ప్రశ్నించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఇచ్చారు.యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి ఆయన ఘనం తనపై దుష్ప్రచారం చేస్తూ తనను ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించామంటూ ప్రెస్ మీట్ లు పెట్టడంపై ద్వజమెత్తారు.
తనపై కావాలనే కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి జిల్లాలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ జిల్లా యువజన పార్టీ ఉపాధ్యక్షులు యోగేష్ మంచివార్ ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనను జిల్లా ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించినట్లు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండి పడుతూ ఆయన మాట్లాడారు.జిల్లా అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి నలుగురు నాయకులను వెంట వేసుకొని తనపై దుష్ప్రచారానికి తెర లేపారని ఇది సరియైన విధానం కాదని విమర్శించారు.
తనను సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గానికి పిర్యాదు చేశానని త్వరలో వారిపై క్రమ శిక్షణ చర్యలకు ఆశిస్తున్నానని అన్నారు. తన పిర్యాదుతో స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు సదరు అంశంపై వివరణకు సైతం ఆదేశించారన్నారు. పార్టీ నియమాలను అతిక్రమించిన వారెవరిని వదిలే ప్రసక్తే లేదని తన పలుకుబడిని ఉద్దేశ్యపూర్వకంగా డ్యామేజ్ చేస్తే ఊరుకోననని హెచ్చరించారు. వారిపై క్రమ శిక్షణ చర్యలు అయ్యేవరకు తాను వదలని స్పష్టం చేశారు. ఏది ఏమైనా పార్టీ నియమాలకు కట్టుబడి గత 8 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నానని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.




