Kanthali: కంఠలిలో 'మన గ్రామం - మన ఆరోగ్యం' ఉచిత వైద్య శిబిరం

Kanthali: జుక్కల్ మండలం కంఠలిలో సర్పంచ్ గౌలే నాగనాథ్ ఆధ్వర్యంలో 'మన గ్రామం-మన ఆరోగ్యం' వైద్య శిబిరం. 160 మందికి పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ.

VEERANNA, JUKKAL
Published on: 31 July 2026 8:12 PM IST
Kanthali
X

Kanthali: కంఠలిలో 'మన గ్రామం - మన ఆరోగ్యం' ఉచిత వైద్య శిబిరం

కంఠలి: కంఠలి (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కంఠలి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ ఆధ్వర్యంలో "మన గ్రామం -మన ఆరోగ్యం "పేరిట గ్రామ ప్రజలకు ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో జుక్కల్ ప్రభుత్వ అస్పత్రి వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్సిలించి అవసరమైన మందులు, మాత్రాలను ఉచితంగా పంపిణి చేశారు.వైద్య శిభిరం లో భాగంగా పాల్గొన్న 160 మంది ఓ పి లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్బంగా వైద్యులు గ్రామ ప్రజలకు ప్రస్తుత వర్షాకాలం లో వ్యాపించే వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, శుద్ధి చేసిన తాగునీటి వినియోగం, దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల పై అవగాహన కల్పించారు.

వర్షాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,జ్వరం, జలుబు, వైరల్ వ్యాధులు, నీటి ద్వార వ్యాపించే రోగాల భారీ నుండి రక్షణకు పాటించాల్సిన పలు సూచనలు చేశారు. గ్రామం లో ఆరోగ్య చైతన్యం పెంపోందించేందుకు ఇలాంటి ఆరోగ్య శిభిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రామ ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తపర్చారు.

వైద్య శిభిరం లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములై శిభిరన్ని సద్వినియోగం చేసుకున్నారు. వర్షాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రామస్థుల ఆరోగ్య రక్షణ కోసం ముందుకు వచ్చి శిభిరం నిర్వహించిన గ్రామ సర్పంచ్ జి. నాగనాథ్ కు గ్రామ ప్రజలు అభినందించారు.

కార్యక్రమం లో పల్లె దావఖానా వైద్యులు మాధవ్, పి హెచ్ ఎన్. శ్యామల,ఆశ కార్యకర్త లు సునీత, తయార్భి, శ్రీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story