Kamareddy: హిందీ మండల టాపర్‌కు ఘన సన్మానం, నగదు ప్రోత్సాహకం!
Kamareddy: హిందీ వ్యాసరచన పోటీల్లో మండల టాపర్‌గా నిలిచిన కాటేపల్లి విద్యార్థిని తబుసుంకు ఘన సన్మానం. రూ.1,100 నగదు బహుమతి అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లప్ప పటేల్.
Kamareddy: హిందీ మండల టాపర్‌కు ఘన సన్మానం, నగదు ప్రోత్సాహకం!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండలంలోని కాటేపల్లి జడ్‌పీహెచ్‌ఎస్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తబుసుంకు ఘన సన్మానం నిర్వహించారు. మండల స్థాయిలో జరిగిన హిందీ వ్యాసరచన పోటీలో మండల టాపర్‌గా నిలిచిన తబుసుంకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ రూ.1,100 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించిన హిందీ ఉపాధ్యాయురాలు సునీతను కూడాశాలువాతోసన్మానించారు.కార్యక్రమంలో మల్లప్ప పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభకు ప్రోత్సాహం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో పదో తరగతి పాఠశాల టాపర్‌కు రూ.11 వేల నగదు బహుమతి అందించినట్లు గుర్తుచేశారు.
ఈ విద్యా సంవత్సరంలో కాటేపల్లి పాఠశాల విద్యార్థి పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిస్తే రూ.21 వేల, పాఠశాల టాపర్‌గా నిలిస్తే రూ.11 వేల, అలాగే నవోదయ సీటు సాధించిన విద్యార్థికి రూ.1,500 నగదు ప్రోత్సాహకం అందజేస్తానని ప్రకటించారు.విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీ పరీక్షలు, ప్రతిభా పోటీల్లో రాణించి కాటేపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయనఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవ్, శంకర్, లలిత, సుజాత, భక్షిరామ్, మంజుల, అశోక్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.




