Kamareddy: కౌలస్ నాలా ప్రాజెక్ట్ 1 గేటు ఎత్తివేత మంజీరా నదిలోకి నీటి విడుదల

Kamareddy: కామారెడ్డి జిల్లా కౌలస్ నాలా ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుండటంతో 1 గేటు ఎత్తివేత. మంజీరా నదిలోకి నీటి విడుదల, పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక.

VEERANNA, JUKKAL
Published on: 24 Aug 2026 1:12 PM IST
Kamareddy
X

Kamareddy: కౌలస్ నాలా ప్రాజెక్ట్ 1 గేటు ఎత్తివేత మంజీరా నదిలోకి నీటి విడుదల

Kamareddy: జుక్కల్ (కామారెడ్డి ) కౌలస్ నాలా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరుచేరుతుండటంతో సోమవారం అధికారులు ఒక గేటును ఎత్తివేశారు. దిగువ ప్రాంతంలోని కౌలస్ వాగు ద్వారా మంజీరా. నదిలోకి590క్యూసెక్కులనీటినివిడుదలచేస్తున్నారు. ప్రాజెక్ట్పూర్తిస్థాయినీటిమట్టం458.00అడుగులుకాగాప్రస్తుతంనీటిమట్టం457.83అడుగులకుచేరింది.అదేవిధంగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.237టీఎంసీలు. కాగాప్రస్తుతం1.196టీఎంసీలనీరునిల్వఉన్నట్లుఅధికారులుతెలిపారు.

వరదప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కౌలస్ వాగు, మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు, రైతులు వాగులు, నదుల వైపువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కౌలస్ నాలా ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరుచేరుతున్ననేపథ్యంలోఅధికారులుపరిస్థితినిఎప్పటికప్పుడుపర్యవేక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలుఅధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఏ ఇ అశ్విని. సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story