Jukkal: హైదరాబాద్‌లో ఖేలో ఇండియా యువత రెజ్లింగ్ గేమ్స్ ఎంపికలు!

Jukkal: ఖేలో ఇండియా యువత రెజ్లింగ్ గేమ్స్-2026 ఎంపికలు ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహణ. వివరాలు వెల్లడించిన అసోసియేషన్.

VEERANNA, JUKKAL
Published on: 15 Sept 2026 3:48 PM IST
Jukkal
X

Jukkal: హైదరాబాద్‌లో ఖేలో ఇండియా యువత రెజ్లింగ్ గేమ్స్ ఎంపికలు!

Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) ఖేలో ఇండియా యువత రెజ్లింగ్ గేమ్స్–2026కు సంబంధించిన జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు.

అండర్-17 విభాగంలో 2008, 2009, 2010 సంవత్సరాల్లో జన్మించిన క్రీడాకారులు ఈ ఎంపికలకు అర్హులని పేర్కొన్నారు.మహిళల రెజ్లింగ్‌లో 46, 49, 53, 57, 61, 65, 69 కేజీల బరువు విభాగాల్లో, బాలుర ఫ్రీస్టైల్ మరియు గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో 51, 55, 60, 65, 71, 80, 92 కేజీలబరువువిభాగాల్లోఎంపికలుజరుగుతాయనితెలిపారు.ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బోనాఫైడ్ సర్టిఫికేట్లనుతమవెంటతప్పనిసరిగాతీసుకురావాలనిసూచించారు.

ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మెమో కూడా సమర్పించాలని తెలిపారు.రెజ్లింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు, క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం 6302534134 నంబర్‌ను సంప్రదించాలని కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కోరారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL