Kamareddy: ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు!
Kamareddy: ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి.
Kamareddy: ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు!
Kamareddy: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు,స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నా.
నిజాం పాలనలో వందేమాతరం పాడితే శిక్షించే రోజుల్లో బాధితుల తరుపున లాయర్ గా వాధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యోధుడు అని కొనియాడారు.
బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటం చేసి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన తెలంగాణ వాది.తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాటం చేసిన ఉద్యమకారుడు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే మనం అయనకీచ్చే నిజమైన నివాళి అని తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి,మున్సిపల్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




