Kamareddy: ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
Kamareddy: కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సతీష్ జర్నలిస్టుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Kamareddy: ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
Kamareddy: జుక్కల్ (కామారెడ్డి) జిల్లాలోని ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు ల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగిరి సతీష్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు లకు ప్రభుత్వం ద్వార ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు అయ్యేలా ఎమ్మెల్యే ల సహకారం తో ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు లందరు ఐక్యతతో పని చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి లో కామారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలిచేలా తోటి జర్నలిస్టు లతో సమన్వయం తో పని చేస్తూ జర్నలిస్టు లకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా నాని తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ను జిల్లా లో బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ జర్నలిస్టు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.




