Mopal: మోపాల్ మండలం సిర్పూర్ అటవీ శివారులో చిరుత సంచారం

Mopal: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరణ.

M. RAMESH,NIZAMABAD
Published on: 28 May 2026 3:04 PM IST
Mopal
X

Mopal: మోపాల్ మండలం సిర్పూర్ అటవీ శివారులో చిరుత సంచారం

మోపాల్: మండలంలోని సిర్పూర్ అటవీ ప్రాంత శివారులో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచరిస్తోందని గత వారం రోజులుగా గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఈ నేప థ్యంలో ఫారెస్ట్ అధికారులు సబ్స్టేషన్ వద్ద రైతు నాగేష్ కి చెందిన డెయిరీ ఫామ్ సీసీ ఫుటేజీని పరిశీలించి చిరుత కదలికలను గుర్తించారు. వారం రోజుల వ్యవధిలో అర్ధరా త్రి సమయంలో చిరుత రెండుసార్లు వచ్చిందన్నారు. అటవీ ప్రాంతానికి ప్రజలు, రైతు లు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని ముదక్ పల్లి సెక్షన్ అధికారి బాసిత్ సూచించారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story