Kamareddy: శివారులో చిరుత సంచారం పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ!

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రాఖండి శివారులో చిరుత సంచారం కలకలం. పాదముద్రలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అటవీశాఖ.

VEERANNA, JUKKAL
Published on: 25 Sept 2026 10:48 AM IST
Kamareddy
X

Kamareddy: శివారులో చిరుత సంచారం పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ!

Kamareddy: వజ్రా ఖండి (కామారెడ్డి ) జుక్కల్ మండలం వజ్రాఖండి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలను గుర్తించి చిరుత సంచారం ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లే రైతులు, కూలీలు, ప్రజలు ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులుహెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే తమ తమ పశువుల కొట్టాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, గొర్రెల కాపరులు తమ మందలను ఒంటరిగా మేపేందుకు వెళ్లకుండా గుంపు గుంపులుగా వెళుతు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

చిరుత కదలికలపై అటవీశాఖ నిరంతరం నిఘా ఉంచిందని, ప్రజలు ఎక్కడైనా చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి సమయాల్లో అత్యవసరమైన పరిస్థితి వస్తే ఒంటరిగా వెళ్లకుండా ఇతరుల సహాయం తీసుకొని గుంపు గుంపులుగా వెళుతు అప్రమత్తంగా వ్యవహారించాలని జుక్కల్ అటవీ శాఖ బిట్ అధికారి రాములు సూచించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL