Banswada: అంబం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ!
Banswada: రుద్రూర్ మండలం అంబం(ఆర్) ఎంపీయూపీఎస్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.
Banswada: అంబం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ!
బాన్స్వాడ: లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ (డిస్ట్రిక్ట్: 320 D, జోన్: 3, రీజియన్: NZB) ఆధ్వర్యంలో గురువారం రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామం. ఎం.పి.యు.పి.ఎస్. పాఠశాలలో విద్యార్థులకు రుద్రూర్ కు చెందిన వ్యాపారవేత్త బచ్చు రాము సెట్, రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబం(ఆర్) గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లె సాయి ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బడే రాము, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




