Bodhan: బోధన్ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.. వడ్ల లారీ బోల్తా!
Bodhan: బోధన్ మండలం కల్దుర్కి గ్రామ సమీపంలోని రాజన్న చౌరస్తా వద్ద వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
Bodhan: బోధన్ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.. వడ్ల లారీ బోల్తా!
Bodhan: బోధన్ మండలం కల్దుర్కి వద్ద వడ్ల లారీ బోల్తా పడడం తో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. మంగళవారం వడ్ల లోడ్ తో వస్తున్న లారీ అదుపు తప్పి రాజన్న చౌరస్తా వద్ద బోల్తా పడడం తో వడ్ల సంచులు పూర్తిగా రోడ్డు పై పడి పోయాయి.
ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్ లారీ లో నే ఇరుక్కు పోవడం తో స్థానికులు గమనించి లారీ డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్ ఐ మచ్చందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వడ్ల ను రోడ్డు పై నుండి తొలగించి ట్రాఫిక్ సమస్య తలేత్త కుండా చర్యలు చేపట్టారు.
Next Story




