Kamareddy: తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Kamareddy: కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ వద్ద తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడు. ఆటో డ్రైవర్, పోలీసుల సమయస్ఫూర్తితో గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు చేరిన అన్విక్.
Kamareddy: తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
కామారెడ్డి: ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకి ఇస్రోజివాడి కు చెందిన కంచర్ల శంకర్, పావని ఇద్దరు భార్యాభర్తలు మరియు వారి పిల్లవాడు అన్విక్ వయసు 5 సంవత్సరాలు తో నిజాంసాగర్ రోడ్డుకు ఉన్న విశాల షాపింగ్ మాల్ నందు బట్టలు ఖరీదుకు వచ్చినప్పుడు అన్విక్ తప్పిపోగా ఆటో డ్రైవర్ కొంక ప్రసాద్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది.
కామారెడ్డి పోలీసు వారు SHO గారి సూచనల మేరకు అట్టి బాలుని వివరాలు తెలుసుకొని విలేజ్ గ్రూపులలో మరియు మీడియా వారికి మెసేజ్ ల రూపంలో తెలుపగా ఆ విధంగా సమాచారం తెలుసుకున్న అన్విక్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కామారెడ్డికి రాగా అన్విక్ ను వారికి అప్పగించడం జరిగింది
Next Story




