Nandipet: నందిపేట్‌లో దుర్గామాత వంటశాలకు బిఆర్ఎస్ నేత విరాళం!
Nandipet: నందిపేట్ శ్రీ శక్తిరూపిణి దుర్గామాత మండప ప్రసాద వంటశాల నిర్మాణానికి బిఆర్ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ రూ. 21,000 విరాళం. దసరా శుభాకాంక్షలు.
Nandipet: నందిపేట్‌లో దుర్గామాత వంటశాలకు బిఆర్ఎస్ నేత విరాళం!
Nandipet: నందిపేట్ జిల్లా కేంద్రం నందిపేట్ గ్రామంలో గల శ్రీ శక్తి రూపిని దుర్గామాత మండప ప్రసాద వంటశాల నిర్మాణానికి నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ తల్లిదండ్రులు మచ్చర్ల సుశీల చిన్న సాయన్న సోదరుడు మచ్చర్ల సందీప్ జ్ఞాపకార్థం తో 21 వేల రూపాయల యూత్ కు అందజేయడం జరిగింది. నవరాత్రులు ఆ జగన్మాత కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెడు పైన మంచి సాధించిన విజయానికి సూచికగా ఉండే విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మచ్చర్ల సాగర్ విజయదశమి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ శక్తి రూపిని దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబానికి అమ్మ దయతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.




