Madnoor: సోయాబీన్ పంటల్లో సస్యరక్షణ చర్యలు మద్నూర్ AO రాజు

Madnoor: మద్నూర్ మండలంలో సోయాబీన్ పంటలను పరిశీలించిన AO రాజు. వర్షాల వల్ల వచ్చే తెగుళ్లు, నివారణా చర్యలపై రైతులకు పలు సూచనలు, సలహాలు.

VEERANNA, JUKKAL
Published on: 1 Aug 2026 6:42 AM IST
Madnoor
X

Madnoor: సోయాబీన్ పంటల్లో సస్యరక్షణ చర్యలు మద్నూర్ AO రాజు

మద్నూర్: మద్నూర్ (కామారెడ్డి ) మద్నూర్ మండల కేంద్ర శివారులో రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న సోయబిన్ పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం విస్తరంగా కురుస్తున్న వర్షాలు, తేమ పరిస్థితుల దృశ్య పంటలో ఏర్పడ్తున్న వ్యాధులు,పోషక లోపాలను గుర్తించి రైతులకు పలు సూచనలు చేశారు.

పరిశీలనలో సోయబిన్ పంటలో వేరు కుళ్ళు, కాండం కుళ్ళు లక్ష్యణాలు గమనించినట్లు తెలిపారు.వీటి నికరణకు కర్బండాజిం + మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచకారి చేయాలనీ సూచించారు.అలాగే పోషక లోపం కారణంగా మొక్కల పై భాగంలోని చిగురకులు పసుపు రంగంలోకి మారుతున్నట్లు గుర్తించిన అధికారి, నివారణ చర్యగా 13-0-45 ఎరువును 10 గ్రాములు, పార్ములా -4ను 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచకారి చేయాలనీ తెలిపారు.

అదనంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల యూరియాను పై పాటుగా వేయాలని రైతులకు సూచించారు. పంటలో కాండపు ఈగ, కాండం తోలుచు ఈగలు కన్పించినట్లయితే ఏసీపీట్ మందును లీటర్ నీటికి 1.5 గ్రాములు లేదా తయోమితక్షం + లందశహలొత్రిన్ మందును 0.4 మిల్లి లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచకారి చేయాలని సూచించారు.

రైతులు సాగు చేస్తున్న పంటను తరచు పరిశీలిస్తూ ప్రారంభ దశలోనే వ్యాధులు, పురుగులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే పంట దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు.కార్యక్రమం లో ఏ ఇ ఓ లు సౌమ్య శ్రీ,విశాల్,రాజహిత తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story