Madnoor: మద్నూర్‌లో విశ్వకర్మ యోజన కింద 40 మందికి వాషింగ్ మెషీన్ల పంపిణీ!
Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ పోస్టాఫీస్‌లో విశ్వకర్మ యోజన కింద 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లు పంపిణీ.
Madnoor: మద్నూర్‌లో విశ్వకర్మ యోజన కింద 40 మందికి వాషింగ్ మెషీన్ల పంపిణీ!
Madnoor: మద్నూర్ (కామారెడ్డి ) ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా మద్నూర్ పోస్టాఫీస్‌లో 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సంప్రదాయ వృత్తిదారులకు అండగా నిలిచి, వారి జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.
కార్యక్రమంలో మద్నూర్ మండల అధ్యక్షులు తుకారాం, సర్పంచ్ మాధవ్‌తో పాటు తమ్మీవర్ అజయ్, శివ, శివన్న, యోగేష్, నరేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సబ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవకులు (GDS) కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా కృషిచేయాలనిఈసందర్భంగా వారు పేర్కొన్నారు. వాషింగ్ మెషీన్ల పంపిణీతో లబ్ధిదారుల వృత్తికి మరింత తోడ్పాటు లభించి,ఆర్థికంగా అభివృద్ధిచెందేందుకుదోహదపడుతుందనిఆకాంక్షించారు.




