Madnur: మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి లో బెడ్ ల కొరత ఇబ్బంది పడుతున్న రోగులు

Madnur: మద్నూర్ (కామారెడ్డి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో బెడ్ ల కొరత తీవ్రంగా ఉంది.

VEERANNA, JUKKAL
Published on: 21 July 2026 4:43 PM IST
Madnur
X

Madnur: మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి లో బెడ్ ల కొరత ఇబ్బంది పడుతున్న రోగులు

మద్నూర్: మద్నూర్ మండలకేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కి వర్షాకాలం నేపథ్యంలో రోగుల తాకిడి పెరిగింది. ఒక్క సోమవారం రోజె సుమారు 240 మంది ఓ పి రోగులు చికిత్స కోసం ఆస్పత్రికి రావడంతో అందుబాటులో ఉన్న బెడ్ లు పూర్తిగా నిండిపోయాయి.మండలంలోని అవల్ గావ్, తడి హిప్పర్గ, సొనల గ్రామాలకు చెందిన కొందరికి వంతులు, విరోచనాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి రావడంతో వచ్చిన రోగులకు కావాల్సిన బెడ్ లు లేక ఒకే బెడ్ పై ఇద్దర్ని ఉంచి వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది.

వచ్చిన రోగులలో జ్వరం తో 20 మంది,విరోచనాలతో 14 మంది రోగులు రావడంతో వారికి కావాల్సిన వైద్యాన్ని అందించి వారి వారి ఇండ్లకు పంపించారు.అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.సాధారణ రోజుల్లో బెడ్ లు సరిపోతున్నప్పటికీ , వర్షాకాలం లో రోగుల సంఖ్య కాస్త పెరగడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.

గ్రామీణ ప్రాంతా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి లో బెడ్ ల సంఖ్య ను పెంచడంతోపాటు రోగులకు చికిత్స అందించేందుకు గాను అవసరమైన వైద్య సిబ్బంది నీ నియమించి వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, వర్షాకాలం లో కలుషిత నీటి వల్ల డయేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు మరిగించిన నీటినిత్రాగుతూ పరిశుభ్రత పాటించాలని ఆస్పత్రి వైద్యులు డాక్టర్ . ఆనంద్ జాదవ్, హెడ్ నర్స్ ముని ర బేగం లు సూచిస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story