Bodhan: నిజామాబాద్ సీపీ ఆదేశాలతో భారీ ఆపరేషన్!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చీతా ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది.
Bodhan: నిజామాబాద్ సీపీ ఆదేశాలతో భారీ ఆపరేషన్!
బోధన్: నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చీత ఫోర్స్ బృందం శనివారం రాత్రి దాడులు నిర్వహించి భారీ గుట్కా నిల్వలను స్వాధీనపరుచుకున్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశానుసారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చీత ఫోర్స్ బలగాలు హెచ్ కే జి ఎన్ షాప్ తో పాటు మటన్ షాప్ లో నిలువ ఉంచిన గుట్కా సంచుల డబ్బులను ఏసిపి మస్తాన్వలి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గుట్కాసంచలను స్వాధీనపరుచుకున్నారు.
నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్నట్లు పక్క సమాచారం అందడంతో రెక్కి నిర్వహించిన చితా బృందం పగడ్బందీ దాడులు నిర్వహించి నిర్వాహ కుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా సుమారు రూపాయల 30 లక్షల విలువ గల గుట్కా సంచులను ప్రాదినపరుచుకున్నామని స్పెషల్ ఫోర్స్ వెల్లడించింది. పట్టుకున్న గుట్కాసంచులను ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ వెల్లడించారు.




