Armoor: సర్పంచ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఎన్యుమరేషన్

Armoor: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'SIR' ఎన్యుమరేషన్ ఫారాల వెరిఫికేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయింది.

VAMSHI, ARMOOR
Published on: 16 July 2026 9:23 AM IST
Armoor
X

Armoor: సర్పంచ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఎన్యుమరేషన్

Armoor: ప్రభుత్వం ప్రవేశపెట్టిన SIR ఎన్యుమరేషన్ ఫామ్ లు జిల్లా కేంద్ర మాక్లూర్ మండలం (అడవి)మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కూనలతసాగర్ , ఉప సర్పంచ్ తరిగొప్పుల చిరంజీవి , గ్రామ వార్డ్ మెంబర్లు లింగన్న భోజేందర్ ప్రతిరోజు సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గ్రామ ప్రభుత్వ ఉద్యోగులతో అందరితో కలిసి సర్ ఫామ్ మీటింగ్లలో పాల్గొని నేటి కి ఈ రోజున 100% పూర్తి చేయడం జరిగింది.

మాక్లూర్ మండల అధికారులు:

ప్రభుత్వఓ ప్రవేశపెట్టిన SIR ఫామ్ కార్యక్రమం గ్రామంలో ఉన్న ఓటర్లు వెరిఫికేషన్ లో త్వరగా 100% పూర్తి చేసినందున, ఇంకా గడువు ఉన్న గాని త్వరగా పూర్తి చేశారు అంటూ మండల ఆర్. ఐ, ఎమ్మార్వో లు గ్రామ సర్పంచ్ కు, సెక్రెటరీ, వార్డ్ మెంబెర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ:

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు, SIR ఫామ్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా, వెంటనే వచ్చిన అధికారులకు స్పందించి, కొందరు గ్రామపంచాయతీ తీసుకొచ్చి, ఫామ్ లు ఇచ్చి ఓటర్లు జాబితాలో ఓట్లు ఉండేలా సహకరించినారు, ఇంకా ముందు ముందున ప్రభుత్వం ఎలాంటి ప్రవేశపెట్టిన గాని, మేము సహకరించి వెంటనే పూర్తి చేస్తామంటూ గ్రామ ప్రజలు అందరు కలిసి అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రెటరీ, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story