Bichkunda: బిచ్కుంద మండల సమైక్య వార్షిక మహాసభ నిర్వహణ!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల సమైక్య వార్షిక మహాసభ నిర్వహించారు. నూతన అధ్యక్షురాలిగా రేష్మా బేగం, కార్యదర్శిగా రుక్మిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Bichkunda: బిచ్కుంద మండల సమైక్య వార్షిక మహాసభ నిర్వహణ!
బిచ్కుంద: బిచ్కుంద మండల సమాఖ్య అధ్యక్షురాలు మహానంద ఆధ్వర్యంలో 2025–26సంవత్సరానికిసంబంధించిన మండల సమైక్య వార్షిక మహాసభ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు మండల సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, చేసిన పనులు, ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా చర్చించారు.
అలాగేరాబోయే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, మహిళా సంఘాఅభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక రూపొందించారు. పదవీకాలంపూర్తైనకార్యవర్గ సభ్యుల స్థానంలో నూతన సభ్యులనుఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.
అధ్యక్షురాలిగా రేష్మా బేగం (గుండె నెమలి), కార్యదర్శిగా రుక్మిణి (ఖత్‌గాం), కోశాధికారిగా చంద్రకళ(పుల్కల్)ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు.ఈ సమావేశంలో మద్నూర్ ఏపీఎం జగదీష్ కుమార్, బిచ్కుంద ఏపీఎం రవీందర్, సీసీలు, అకౌంటెంట్‌తో పాటు మండల పరిధిలోని 28 గ్రామ సంఘాలఅధ్యక్షురాళ్లుపాల్గొన్నారు.




