Potangal: మామిడి తోట.. గుర్తు తెలియని వ్యక్తుల ఘాతుకానికి రైతు రోదన

Potangal: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పోతంగల్ మండలంలో దారుణం జరిగింది.

K RAVI, BODHAN
Published on: 6 May 2026 1:19 PM IST
Potangal
X

Potangal: మామిడి తోట.. గుర్తు తెలియని వ్యక్తుల ఘాతుకానికి రైతు రోదన

పొతంగల్: బోధన్ డివిజన్ పరిధిలోని పోతంగల్ మండలం చైతన్ నగర్ గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. బుధవారం బాధిత రైతు షేక్ హాజీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు తన మామిడి తోటకు నిప్పంటుకొని సుమారు 15 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం తోటను రూ. 2 లక్షలకు కౌలు తీసుకొని తోటను సాగు చేస్తున్నానని హాజీ వెల్లడించారు. చేతికొచ్చిన పంట ఇటీవల వడగళ్ల వానకు పూర్తిగా నేలరాలిపోవడంతో భారీగా నష్టం జరిగిందని దీనికి తోడు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిపు మూలంగా మిగిలిన చెట్లు సైతం దగ్ధమవడంతో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తనకు ప్రభుత్వం నుండి నష్టపరి హారం అందేలా చూడాలని వేడుకున్నాడు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story