Nizamabad: ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల సంబరం.. పాలు పొంగించిన ఎమ్మెల్యే, కలెక్టర్!
Nizamabad: నిజామాబాద్ కులాస్‌పూర్‌లో 692 ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు. పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి.
Nizamabad: ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల సంబరం.. పాలు పొంగించిన ఎమ్మెల్యే, కలెక్టర్!
Nizamabad: కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క నిరుపేదుకు ఇళ్ళు ఇవ్వాని ఘనత భారస కు దక్కుతుంది అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కులాస్ పూర్ లో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలు చేయించారు.. అనంతరం లబ్ధిదారుల దంపతులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే అందించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు పండగ తరహాలలో 692 సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు పారదర్శకంగా నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలు అదించామని వెల్లడించారు..
రాష్ట్రంలో ఒక్క గుడిసె కుడు లేకుండా పక్క ఇళ్ళు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.. త్వరలో ఇంటి స్థలం లేని వారికి 75 గజలలో ఇళ్ళు నిర్మించి ఇస్తాం అని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్ట్ తో సన్న బియ్యం అందిస్తున్నాం.. దాన్యం కొనుగోలులో బీజేపీ,భారస రాజకీయం చేయడం తప్ప రైతులపై ప్రేమ లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హంధన్, రాష్ట్ర గౌడ సంఘ కార్పోరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సర్పంచ్ జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




