Bodhan: బోధన్‌లో ఘోర అగ్నిప్రమాదం దాబా దగ్ధం!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాన్సువాడ రోడ్డులోని ఒక దాబా హోటల్ పూర్తిగా దగ్ధమైంది.

K RAVI, BODHAN
Updated on: 1 May 2026 1:13 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో ఘోర అగ్నిప్రమాదం దాబా దగ్ధం!

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బాన్సువాడ రహదారిపై ఉన్న దాబా హోటల్ కు ఒకసారిగా నిప్పట్టుకోవడంతో దాబా హోటల్ పూర్తిగా ఈ ప్రమాదంలో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న దాబా యజమాని గౌతమ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉటావుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసేలోపు దాబా హోటల్ షెడ్యూల్ పూర్తిగా దగ్ధమైపోయాయి.

హోటల్లో ఉన్న సిలిండర్లను సిబ్బంది బయటకు తీశారు. ప్రమాదం సమయంలో దాబా మూసి ఉండడంతో భారీగా ప్రాణానిష్టం సైతం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. దాబా చుట్టుపక్కల పంటపొలాలు ఉండడంతో పంటలకు నిప్పి పెట్టడం మూలంగానే ప్రమాదం జరిగిందని హోటల్ యజమాని ఆరోపించారు. పంటలను విప్పి పెట్టడం మూలంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని రైతులకు అధికారులు కనువిప్పు కలిగించేలా అవగాహనలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story