Kamareddy: కామారెడ్డిలో అర్ధరాత్రి దారుణం.. కళ్లముందే 21 షాపులు బుగ్గిపాలు!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది.

MADHU, KAMAREDDY
Published on: 3 May 2026 11:15 AM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో అర్ధరాత్రి దారుణం.. కళ్లముందే 21 షాపులు బుగ్గిపాలు!

కామారెడ్డి జిల్లా: కేంద్రంలోని ఇందిరా చౌక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రూట్ షాపులతో సహా మొత్తం 21 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story