Banswada: పట్టపగలే భారీ చోరీ - 29.05 తులాల బంగారం అపహరణ!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దారుణం. కిరాణం దుకాణానికి వెళ్లిన సమయం చూసి ఇంట్లో తాళాలు పగలగొట్టి 29.05 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు.
Banswada: పట్టపగలే భారీ చోరీ - 29.05 తులాల బంగారం అపహరణ!
Banswada: కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణం లో ఆదివారం రోజు ఓల్డ్ షేక్ చాంద్ హోటల్ సమీపం లో ఉన్న చింతల భాస్కర్ ఇంట్లో పట్ట పగలు తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిందనీ బాధితుడు బాన్సువాడ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చింతల భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఇంటికి తాళం వేసి భార్య తో పాటు తన కిరణం దుకాణానికి వెళ్ళారు. కాసేపటి తర్వాత చింతల భాస్కర్ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది.
లోపల వెళ్ళి చూడగా బీరువా తెరిచి ఉంది . బీరువా లో ఉన్న బంగారు నగలు 29.05 ఇరవై తొమ్మిదిన్నర తులల బంగారు నగలు కొంత నగదు, వెండి పోయినట్లు గుర్తించిన బాధితుడు, వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు తెల్పారు.
పోలీసులు గణేష్ నిమజ్జనాల బందోబస్తులో నిమగ్నమై ఉండగా, పట్ట పగలే దొంగతనం జరగడం విస్మయానికి గురిచేసింది. 29.05 తులాల బంగారం,వెండి మరియు నగదు రూపంలో భారీ దొంగతనం జరిగిందని తెల్సి, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.




