Nizamabad: డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ: తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం.. రూ. 12 లక్షల నగదు, బంగారం మాయం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో భారీ చోరీ జరిగింది. ఇస్లాంపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు 12 తులాల బంగారం, 20 తులాల వెండి మరియు 12 లక్షల నగదు దోచుకెళ్లారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 30 April 2026 7:34 AM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ: తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం.. రూ. 12 లక్షల నగదు, బంగారం మాయం!

నిజామాబాద్ (డిచ్‌పల్లి): నిజామాబాద్ జిల్లా పట్టపగలే దొంగల బీభత్సం...డిచ్ పల్లి మండలం ఇస్లాంపూర్ కాలనీ లో మధ్యాహ్నం పూట భారీ చోరీ చోటుచేసుకుంది.ఇంటికి తాళం వేసి బ్యాంకు కు వెళ్లిన ఇంటి యజమాని...తిరిగి ఇంటికి వచ్చేసరికి గందరగోళగా పడి ఉన్న ఇంటి సామగ్రి... వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి 12 తులాలు బంగారు నగలు,20 తులాల వెండి నగలు, 12 లక్షల నగదు చోరీ గురైనట్లు తెలిపారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.. సిసిటివి దృశ్యాలను పరిశీలించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story