Armoor: ‘మన గ్రామం - మన గౌరవం’ పేరిట మాయాపూర్ గ్రామసభ!

Armoor: ఆర్మూర్ నియోజకవర్గం మాయాపూర్‌లో సర్పంచ్ జీవన్ అధ్యక్షతన విజయవంతంగా జరిగిన గ్రామసభ.

VAMSHI, ARMOOR
Published on: 6 Jun 2026 7:55 PM IST
Armoor
X

Armoor: ‘మన గ్రామం - మన గౌరవం’ పేరిట మాయాపూర్ గ్రామసభ!

ఆర్మూర్: ఆర్మూర్ నియోజవర్గం న్యూస్, జూన్ 6: జిల్లా కేంద్ర మాయాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీ బ్యాగరి జీవన్ అధ్యక్షతన శనివారం గ్రామసభ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ సంతోష్ రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు.

గ్రామసభలో వర్షాకాల సన్నద్ధత, సురక్షిత త్రాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, మొక్కల పెంపకం మరియు SIR (Special Intensive Revision) కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు.

ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. అలాగే వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుని పరిశుభ్రతను పాటించాలని కోరారు. SIR కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా సవరణలు జరుగుతున్నందున ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం 3 నుండి 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, VDC సభ్యులు, గ్రామ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “మన ఇల్లు – మన బాధ్యత, మన గ్రామం – మన గౌరవం” అనే నినాదంతో గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని గ్రామపంచాయతీ కోరింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story