Bichkunda: గాంధీ జయంతి నాడు మాంసం, మద్యం విక్రయాలు నిషేధం!
Bichkunda: గాంధీ జయంతి వేళ బిచ్కుందలో మాంసం, మద్యం విక్రయాలపై సంపూర్ణ నిషేధం మున్సిపల్ అధికారుల నోటీసులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని ఇన్‌ఛార్జ్ కమిషనర్ జగ్జీవన్ హెచ్చరిక.
Bichkunda: గాంధీ జయంతి నాడు మాంసం, మద్యం విక్రయాలు నిషేధం!
బిచ్కుంద: గాంధీ జయంతిని పురస్కరించుకుని బిచ్కుంద మున్సిపల్ పరిధిలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు మాంసం విక్రయదారులకు బిచ్కుంద మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 2న పట్టణంలో ఎలాంటి జీవహింసకు పాల్పడరాదని, మాంసం విక్రయాలునిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు.
అలాగే పట్టణ పరిధిలో ఎక్కడా మద్యం విక్రయాలు జరపరాదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి మాంసం లేదా మద్యం విక్రయాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజలు సహకరించి పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.




