Nizamabad: సాలూరాలో మెగా ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన!
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరా మండల కేంద్రంలో సర్పంచ్ సోక్కం లావణ్య రవి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Nizamabad: సాలూరాలో మెగా ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన!
నిజామాబాదు: సాలూర మండల కేంద్రంలో సర్పంచ్సోక్కం లావణ్య రవి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. నిజామాబాద్ పట్టణంలోని మనోరమ ఆస్పత్రి వైద్య బృందం సాలూర గ్రామంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరానికి వచ్చి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
స్త్రీ సంబంధిత వ్యాధులతోపాటు కిడ్నీ, వెన్నుముక, ఇతర రోగాలకు సంబంధించిన రోగులను వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సాధన చికిత్సలతో పాటు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వైద్య బృందం పేర్కొంది. రోగులకు పలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ శిబిరంలో న్యూరో స్పెషలిస్ట్ కట్ట నరసింహ తో పాటు వైద్య బృందం పాల్గొని పలు సలహాలు అందించారు. వైద్య బృందానికి సర్పంచ్ శాలువాతో సత్కరించి సన్మానించారు.
Next Story




