Nizamabad: పెరుగుతున్న ఎండలు.. ఉపాధి పనుల వద్ద వసతులు సున్నా!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘనపూర్ లో ఉపాధి కూలీల నిరసన. ఫేస్ రికగ్నిషన్ సమస్యలు, పని ప్రదేశంలో నీడ, నీటి వసతులు కల్పించాలని డిమాండ్.

M. RAMESH,NIZAMABAD
Published on: 22 April 2026 1:07 PM IST
Nizamabad
X

Nizamabad: పెరుగుతున్న ఎండలు.. ఉపాధి పనుల వద్ద వసతులు సున్నా!

Nizamabad: వీబీ జీ రామ్ జీ (ఉపాధి హామీ) పథకంలో కూలీల సంఖ్య పెంచాలని ఉపాధి కూలీలు సూచించారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామం లో ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి కూలీల సం ఖ్య పెరిగే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో వంద మందికి పైగా కూలీలు పనులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ( face recognition ) తో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.

జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వ యంతో పనులను చేపడితే ఫలితాలు ఉంటాయ న్నారు. గ్రామాల్లో అవసరం ఉన్నచోట పనులను గుర్తించి చేపట్టాలన్నారు. అర్హులకు జాబ్ కార్డులు అందించాలన్నారు. ఎండల తీవ్రత పెరిగినందున పని జరిగే చోట ఒక టెంట్ ఏర్పాటు చేసి త్రాగునీరుని ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించాలని కోరారు. పని ప్రదేశంలో నీడ, నీటి వసతులను కల్పించాలన్నారు. చేసిన పని దినాలకు సరైన వేతనం కూడా చెల్లించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story