Nizamabad: తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో బాలికల కళాశాల ప్రారంభం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 4 July 2026 5:33 PM IST
Nizamabad
X

Nizamabad: తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో బాలికల కళాశాల ప్రారంభం!

నిజామాబాదు: గ్రామ స్థాయి నుండి సీఎం గా ఎదిగిన రేవంత్ రెడ్డి పై గాలికి వచ్చినా వారు విమర్శించడం సరికాదు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు...నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మాన్ పల్లిలో రూ .5 కోట్లతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి కలసి మంత్రి సీతక్క ప్రారంభించారు...వర్షంలో సహితం విద్యార్థులతో కలసి మంత్రి నృత్యం చేశారు.

ఇన్ని రోజులు వర్షాల కోసంఎదురు చూసిన తరుణంలో వానలు విస్తరంగా కవర్షాలు పడడం చాలా సంతోషంగా ఉందని పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీతక్క పేర్కొన్నారు... 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న కొడంగల్ ముద్ద బిడ్డ సీఎం రే వంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు పది ఏళ్లలో పాలనలో విద్య రంగాన్ని పూర్తిగా విస్మరించిందిని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిసనిర్మిస్తుంటే... ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు అని మంత్రి వెల్లడించారు... గత మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ పేదలకు సన్నబియ్యం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని అన్నాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ ప్రతి పేదకు కడుపు నింపుతుందని అన్నారు.మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story