Nizamabad: కొండూరు హై లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు హై లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి.
Nizamabad: కొండూరు హై లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి!
నిజామాబాదు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు హై లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి.నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సిరికొండ మండలం కొండూరు హై లెవెల్ బ్రిడ్జిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో బ్రిడ్జికి నష్టం వాటిల్లడంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
బ్రిడ్జి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత ఇంజినీరింగ్, రోడ్లు-భవనాల శాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బ్రిడ్జికి జరిగిన నష్టం, మరమ్మత్తులకు అవసరమైన చర్యలు, పనులు పూర్తయ్యే సమయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వాహనదారులు, గ్రామస్థులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. మరమ్మత్తు పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.




