Baswapur: బస్వాపూర్‌లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పోచారం!

Baswapur: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 26 Nov 2026 11:47 PM IST
Baswapur
X

Baswapur: బస్వాపూర్‌లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పోచారం!

బస్వాపూర్: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని బస్వాపూర్ లో ఈ రోజు పర్యటించారు.పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బస్వాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చేరాలని పంపిణీ చేపట్టింది.అందులో భాగంగా ఈ రోజు బస్వాపూర్ లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.అనంతరం గ్రామస్థులు శ్రీనివాసరెడ్డి కి శాలువాతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్, అడ్కాస్పల్లి సర్పంచ్ రామ కృష్ణ,గ్రామ పెద్దలు,నాయకులు,మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్,మండలం పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్,కృష్ణారెడ్డి,మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్,అబ్దుల్ మాజిద్,లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు,నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA