Kotagiri: బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేయించిన ఎమ్మెల్యే పోచారం!
Kotagiri: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి ఇందిరమ్మ ఇంటికి గృహ ప్రవేశం చేయించారు.
Kotagiri: బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేయించిన ఎమ్మెల్యే పోచారం!
నిజామాబాద్ జిల్లా: కోటగిరి మండలం లోని బస్వాపూర్ లో ఈ రోజు పర్యటించారు.పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలాగే గ్రామానికి చెందిన బామిని మేఘ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం తో నేడు ఇందిరమ్మ ఇంట్లోకి శాసన సభ్యులు వారికి గృహ ప్రవేశం చేయించారు.అనంతరం ఇంటి యజమాని మేఘ శ్రీనివాసరెడ్డి కి శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్, అడ్కాస్పల్లి సర్పంచ్ రామ కృష్ణ,గ్రామ పెద్దలు,నాయకులు,మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్,మండలం పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్,కృష్ణారెడ్డి,మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్,అబ్దుల్ మాజిద్,లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు,నాయకులు,అధికారులు పాల్గొన్నారు.




