Bansuwada: ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే పోచారం దీపావళి వేడుకలు!

Bansuwada: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 9 Nov 2026 10:21 PM IST
Bansuwada
X

Bansuwada: ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే పోచారం దీపావళి వేడుకలు!

బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో కలిసి, దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుని దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

బొప్పాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

నామ్ గంగమణి – శివలింగం, తేలగాడం వరలక్ష్మి – దత్తు. వడ్ల మమత – బాలు, పాట్ల సుమిత్ర – సురేష్, బొమ్మడి సుధ – సాయిలు

ఇందిరమ్మ ఇళ్లలో దీపాల వెలుగులతో పాటు ప్రతి కుటుంబంలో సంతోషం, సంతృప్తి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA