Banswada: ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ నీరు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!
Banswada: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖరీఫ్ ఆయకట్టులోని 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.
Banswada: ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ నీరు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!
బాన్స్ వాడ: నిజాంసాగర్ (కామారెడ్డి ) ప్రతి యేడు లాగే ఈ యేడు బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ముందుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన వరద గేట్లను పరిశీలించి అనంతరం విలేఖరుల సమావేశాన్నినిర్వహించారు.కామారెడ్డిజిల్లానిజాంసాగర్ ప్రాజెక్ట్ ను బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
గురువారంసందర్శించారు.ప్రాజెక్ట్12గేట్లనుపరిశీలించిన ఆయన ప్రాజెక్ట్ అధికారులను అడిగి నీటి మట్టం, సామర్థ్యం వివరాలనుఅడిగితెలుసుకొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు పడలేవని అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో12టీఎంసీలనీటినిలువలుఉన్నాయన్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టులో ఇప్పటికే వేసిన ఒక లక్ష 24 వేల ఎకరాల వరి సాగుకు అవసరమైన 4 టీఎంసీ ల నీటిని రైతులు కోరినప్పుడు విడతల వారిగా విడుదల చేస్తామని తెలిపారు.
రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఈ పంటలు చేతికి వచ్చే వరకు సాగు నీళ్లు అందించుటకు ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసిందని అన్నాడు. అంతేకాక సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారని వారి సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం లో బాన్స్ వాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.




