Jukkal: బంజేపల్లిలో వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బంజేపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు.
Jukkal: బంజేపల్లిలో వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
Jukkal: మొహమ్మద్ నగర్ మండలం లోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన షాది ముభారక్ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గం లొ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తోట ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిజాంసాగర్ మండలం బంజేపల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు.




