Kamareddy: నిర్మాణ నాణ్యతలో రాజీ వద్దు.. అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే

Kamareddy: మద్నూర్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పరిశీలించారు.

VEERANNA, JUKKAL
Published on: 22 April 2026 9:29 PM IST
Kamareddy
X

Kamareddy: నిర్మాణ నాణ్యతలో రాజీ వద్దు.. అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే

కామారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించడానికి స్వయంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, స్థానిక నాయకులతో కలిసి సయుంక్తగా సందర్శించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి నేతలు, అధికారుల సమక్షంలోనే నిర్మాణ నాణ్యతపై రాజి పడొద్దని స్పష్టం చేశారు. పనులు త్వరిత్వగతిన పూర్తి చేసి, విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల అందించాలని ఆదేశించారు. ఈ పాఠశాల నిర్మాణం వల్ల గ్రామీణ విద్యార్థులకు నగర స్థాయి సదుపాయాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్య న్నీ వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు కు బలమైన పునాది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మద్నూర్ ప్రాంతంలో విద్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ హెచ్. పరమేష్, చైర్మన్ భర్త ఆయిల్వర్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరస్వర్.సాయిలు, విఠల్ గురూజీ, సంతోష్ మేస్త్రి, మాజి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పాటిల్, గోపి లతోపాటు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story