Kamareddy: అచ్చంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Kamareddy: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో రూ. 1.06 కోట్ల వ్యయంతో బిటి రోడ్డు నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు శంకుస్థాపన.

VEERANNA, JUKKAL
Published on: 23 April 2026 9:59 PM IST
Kamareddy
X

Kamareddy: అచ్చంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

వడ్డేపల్లి (కామారెడ్డి): నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో పి డబ్ల్యు డి (PWD) రోడ్డు నుండి నల్లగుట్ట తండా వరకు సుమారు కోటి 6 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన బి టి రోడ్డు నిర్మాణం పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారి సౌకర్యం ఎంతో అవసరమని, ప్రజల సౌలభ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని దశల వారీగా కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అనంతరం నిజాంసాగర్ మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగ నిలుస్తోందని పేర్కొన్నారు. తదుపరి అచ్చంపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story